ములుగు, 2026-07-25
ములుుజల్లఏటూునంమేజ్్మపంచయతీలోసంతవజయోత్సవవేడుకలుఅత్యంతవైభవంజయ.ఈసంద్భం్మఅభవృద్ధకకృషచేస్తున్నస్పంచ్కకులమ్శ్ీలతలక్ష్మణ్బబు,క్యద్శజన్ధన్లను్మస్తులుఘనంసన్మనంచు.
ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో మేజర్ గ్రామపంచాయతీలో సంత విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, గ్రామ అభివృద్ధికి మరియు సంత విజయవంతానికి కృషి చేస్తున్న ప్రముఖులను ఘనంగా సన్మానించారు.
ఈ వేడుకలో భాగంగా గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబుకి మరియు కార్యదర్శి జనార్ధన్ కి గ్రామస్తుల తరఫున తాడూరు రఘు మరియు గ్రామస్థులు శాలువాలతో ఘనంగా సన్మానం చేసి, వారి సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధిలో వారు చూపుతున్న చొరవను ఈ సందర్భంగా ప్రశంసించారు.
గ్రామంలోని ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ సంత విజయోత్సవ వేడుకలో కాకులమర్రి ప్రదీప్ బాబు, తాడూరి రఘు, ఎండి వాలి బాబా, కర్ర రవీందర్, ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, దడిగల సమ్మయ్య, గండేపల్లి నర్సయ్య, తురం పద్మ, వార్డు మెంబర్ గంప కిరణ్, అంగాల వీరన్న, ఏం పెళ్లి రాజు, కోట నరసింహులు, స్థానిక ప్రజలు, పెద్దలు, యువకులు పాల్గొనడం జరిగింది.












