భద్రాద్రి కొత్తగూడెం, 22-07-2026
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కొమరం భీమ్ విగ్రహ పటిష్టత కోసం ఆదివాసీ జేఏసీ చర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కొమరం భీమ్ విగ్రహ పటిష్టత కోసం ఆదివాసీ జేఏసీ చర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జూలై 22, 2026న జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు, ఉపాధ్యాయులు, మహిళలు, యువకులు, చర్ల మండల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొమరం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, 'జల్–జంగల్–జమీన్' నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహావీరుడు కొమరం భీమ్ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేందుకు చర్ల మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహం ఆదివాసీ సమాజ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ చైర్మన్ వాసం. ముసలయ్య, నూగురు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప. శ్రీనివాస్ రావు, సోయం. రాజారావు, తాటి. రామకృష్ణ, ఇరప. రాజు దొర, కారం. నరేష్, ఆదివాసీ పెద్దలు సరేం. సమ్మయ్య, పూనెం. వరప్రసాద్, ఇరప. ప్రకాష్ దొర, శ్యామల. తరుణ్, ఇరప. వసంత్, బీరబోయిన. శేఖర్, ఆదివాసీ ఉపాధ్యాయులు బెండబోయిన. సత్యనారాయణ, శ్యామల. రామారావు, బెండబోయిన. మురళి, కాకా. రాంబాబు, పరిష్క. నాగేశ్వర్రావు, సోయం.శేషు, మీడియం. ఇడమరాజు, ఆదివాసీ మహిళలు ఇరప. అపర్ణ, బీరబోయిన. రాణి, బీరబోయిన. అరుణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే రానున్న ఆగస్టు 9 – ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఆదివాసీ కుటుంబం, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆదివాసీ జేఏసీ చర్ల మండలం కమిటీ పిలుపునిచ్చింది.


