విషయం (సహస్ర) సెప్టెంబర్ 02
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఇసుక సొసైటీ సభ్యులు, కాంట్రాక్టర్ల మధ్య చెక్కుల చెల్లింపుల విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జగదాంబ సెంటర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద జరిగిన ఈ వివాదం రెండు గంటలకు పైగా కొనసాగింది.
ఇసుక సొసైటీ చెక్కుల విషయంలో వాగ్వాదం వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద ఇసుక సొసైటీ సభ్యులు, రేసింగ్ కాంట్రాక్టర్ల మధ్య చెక్కుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం సుమారు రెండు గంటలకు పైగా కొనసాగినట్లు సమాచారం. ఇసుక సొసైటీ సభ్యులకు రావాల్సిన చెక్కులను రేసింగ్ కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని పలువురు మహిళా సభ్యులు ఆరోపించారు. తమకు రావాల్సిన చెక్కులు అందకుండా కొందరు అధికారులపై ఫోన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యులకు న్యాయం చేయాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల మాటలు వింటున్నారంటూ సభ్యులు ఆరోపించారు. తమకు రావాల్సిన చెక్కులను వెంటనే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

