భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21
చర్ల మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సామాజిక కార్యకర్త జవ్వాది ఉమామహేశ్వరావు అకాల మరణంపై సీపీఎం చర్ల మండల కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి మండలానికి తీరని లోటు అని కమిటీ పేర్కొంది.
చర్ల మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన జవ్వాది ఉమామహేశ్వరావు అకాల మరణం అత్యంత బాధాకరమని, ఆయన మృతి మండలానికి తీరని లోటని సీపీఎం చర్ల మండల కమిటీ పేర్కొంది.
మంగళవారం సీపీఎం మండల కమిటీ నాయకులు జవ్వాది ఉమామహేశ్వరావు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు మాట్లాడుతూ, జవ్వాది ఉమామహేశ్వరావు ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అఖిల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఆయన సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆయన మరణం మండల ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరని విషాదమని పేర్కొంటూ, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పొడుపుగంటి సమ్మక్క, వరదల వరలక్ష్మి, కారం నరేష్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి నల్లగట్ల మూర్తి తదితరులు పాల్గొని జవ్వాది ఉమామహేశ్వరావుకు ఘనంగా నివాళులర్పించారు.










