డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, 2024-07-22
ఉప్పలగుప్తం మండలం పెద్దూరు గ్రామ పరిధిలోని మాల మాదిగ పేటలకు తక్షణమే రహదారి కల్పించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోలమూరి మోహన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ప్రభుత్వాలు మారినా మాల, మాదిగలు నివసించే ప్రాంతాలకు రహదారులు లేవని నినదించారు.
ఉప్పలగుప్తం మండలం పెద్దూరు గ్రామ పరిధిలోని మాల మాదిగ పేటలకు తక్షణమే రహదారి కల్పించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోలమూరి మోహన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినప్పటికీ మాల, మాదిగలు నివసించే ప్రాంతాలకు రహదారులు కరువయ్యాయని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











