మానుగూరు, 14 July
ఆటో, మోటార్ కార్మికులందరూ ఐక్యం కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్(TUCI) రాష్ట్ర కార్యదర్శి పాయం. వెంకన్న పిలుపునిచ్చారు. మణుగూరులో జరిగిన ట్రాక్టర్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆటో, మోటార్ కార్మికులందరూ ఐక్యం కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్(TUCI) రాష్ట్ర కార్యదర్శి పాయం. వెంకన్న కార్మికులకు పిలుపునిచ్చారు.
మణుగూరు ఏరియా ట్రాక్టర్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశం TUCI జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన డివి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాదిమంది ఆటో, మోటార్ కార్మికులు స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, వారికి ప్రభుత్వ సహాయం అందడం లేదని అన్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ రవాణా (సవరణ) చట్టం తెచ్చి రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లే కారణమని జరిమానాల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని విమర్శించారు.
జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నారని, డ్రైవర్లను 'ఖూనీ కోర్లు'గా మార్చి జైల్లో నిర్బంధించేలా చట్టాన్ని రూపొందించారని ఆయన మండిపడ్డారు.
మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 2019 మోటార్ రవాణా (సవరణ) చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం, మణుగూరు ఏరియా ట్రాక్టర్ డ్రైవర్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొరసా. సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా మడకం. లక్ష్మయ్య, గట్టుపల్లి. రమేష్, కార్యదర్శిగా కోండ్రు. శ్రీను, సహాయ కార్యదర్శులుగా సవలం. లక్ష్మయ్య, కొక్కిరేణి. మహేష్, కోశాధికారిగా కనితి. భూపతి, కమిటీ సభ్యులుగా గట్టు భద్రయ్య, నూక.సంపత్, కారం. కిశోర్, ఇర్ఫా. ప్రసాద్, బి. శంకర్, కారం. శంకర్ లను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో TUCI మణుగూరు ఏరియా సహాయ కార్యదర్శి పి. సంజీవరెడ్డి, నాయకులు వంశీ, మరియు ట్రాక్టర్ డ్రైవర్లు పాల్గొన్నారు.











