** (సహస్ర) జూలై 06
ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా కలెక్టర్ గారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ తమ సమస్యలను విన్నవించింది. ఏజెన్సీ ఏరియాలలో వరద బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అంగన్వాడి ఉద్యోగాల్లో 100% ఆదివాసి మహిళలకే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా కలెక్టర్ గారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ తమ సమస్యలను విన్నవించింది. ఏజెన్సీ ఏరియాలలో వరద బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అంగన్వాడి ఉద్యోగాల్లో 100% ఆదివాసి మహిళలకే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పర్శిక సతీష్ మాట్లాడుతూ, 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల గ్రామాల్లోని అంగన్వాడి పోస్టులను స్థానిక ఆదివాసి (ఎస్టీ) మహిళలతోనే భర్తీ చేయాలని కోరారు. వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్తారం 2 అంగన్వాడి టీచర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణబాబు, తాటి రాంబాబు మాట్లాడుతూ, 5వ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించినప్పుడు ఆదివాసి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కోయ బెస్తగూడెం, తుర్సవానిగూడెం, టేకుల బోరు, లక్ష్మీపురం, ముత్తారం, సీతారాంపురం, కలిపాక గ్రామాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవించినప్పుడు ఆర్థిక సమస్యలు, మౌలిక వసతులు అందకపోవడం వల్ల గిరిజన గ్రామాలతో బాహ్య ప్రపంచానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, విరోచనాలు వంటి అంటువ్యాధులు ప్రబలుతాయని వాపోయారు. వెంకటాపురం వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, సోడి గోపి, చంద సూరిబాబు, కాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.










