Charla, 6 July
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు విడుదల చేయలేదని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, అర్హులైన వారందరికీ వెంటనే రూ. 4 వేల చొప్పున పెన్షన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు విడుదల చేయలేదని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు.
57 ఏళ్లు నిండిన వారందరూ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే వందల రూపాయలు ఖర్చు పెట్టి, మీసేవా కేంద్రాల ద్వారా లక్షల మంది అప్లికేషన్లు పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జూన్ 2వ తేదీన 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి, జూలై 2వ తేదీ వచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని, పెన్షన్లు, ఇళ్ల కోసం ఎదురుచూస్తూ ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ మీసేవల ద్వారా ఆదాయం పొందుతోందని ఆరోపించారు.
గతంలో కెసిఆర్ ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, రూ. 2000 చొప్పున పెన్షన్లు అందించారని, అలాగే వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వృద్ధులకు ఈ పెన్షన్లు, 6 కేజీల బియ్యం ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, కొడుకులపై ఆధారపడకుండా జీవించడానికి వీలు కల్పించాయని గుర్తు చేశారు. ఇంకా చాలా మంది వృద్ధులు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 4 వేల రూపాయల పెన్షన్ విడుదల చేయాలని ఆయన కోరారు.











