లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
లింగాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ నాయుడు, బండారు రామకృష్ణ సుందరయ్య నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సుందరయ్య పార్టీలకు అతీతంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడని, గ్రామాభివృద్ధికి కృషి చేశారని వారు కొనియాడారు.
సుందరయ్య చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేడబత్తిన వాసు, మేడబత్తిన మనోహర్, యాలం రమేష్, ఆవుల బ్రదర్స్ వెంకట్, నర్సయ్య, మైపా చిరంజీవి, రావుల సతీష్ తదితరులు పాల్గొని సుందరయ్యకు నివాళులర్పించారు.







