Dhumugudam, జూలై 4
ఇల్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా, సొంత ఇల్లు నోచుకోని ఓ నిరుపేద కుటుంబం దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామంలో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోంది. గతంలో నివాసంగా ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుని కూలిపోవడంతో, ప్రస్తుతం ఇతరుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తూ, ఇద్దరు చిన్నారులతో ఈ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇల్లు ఇస్తాం అని ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ తమకు సొంత ఇల్లు కలగలేదని దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం జెట్టి రేవతి కన్నీటి పర్యంతమవుతుంది. గతంలో నివాసంగా ఉన్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని చివరకు కూలిపోవడంతో, ప్రస్తుతం ఇతరుల ఇంట్లో తలదాచుకుంటూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.
కుటుంబ పెద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజువారీ సంపాదనపైనే ఆధారపడే ఈ కుటుంబానికి ఇద్దరు చిన్నారులు ఉండటంతో వారి చదువులు, పోషణ, నిత్యావసర ఖర్చులు కూడా భారంగా మారాయి. సొంత ఇల్లు లేక పరాయి ఇంట్లో నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాకాలం వస్తే మరింత ఆందోళనకు గురవుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కుటుంబాన్ని మన భద్రాద్రి న్యూస్ రిపోర్టర్ చంద్రశేఖర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెట్టి రేవతి కి నిజంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హురాలు తెలుసుకున్నారు. పేద కుటుంబాలు ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో జీవిస్తుండటం బాధాకరమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగకపోవడం విచారకరమని అన్నారు.
ప్రభుత్వం ఇళ్ల మంజూరు ప్రక్రియలో ఈ కుటుంబ పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించి, కనీసం రెండో విడత (సెకండ్ కోటా) లో అయినా ఇల్లు మంజూరు చేసి వారి సొంత ఇంటి కలను సాకారం చేయాలని ఆమె కోరారు. గృహహీనుల జాబితాలో ఈ కుటుంబాన్ని ప్రాధాన్యతతో గుర్తించి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న నేపథ్యంలో, నిజంగా అవసరమైన ఈ కుటుంబానికి తక్షణమే న్యాయం చేసి శాశ్వత నివాసం కల్పించాలని గ్రామస్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పరాయి ఇంట్లో ఆశ్రయం పొందుతూ జీవిస్తున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలుస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












