భద్రాచలం, 27.06.26
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న వర్కర్స్‌పై షెడ్యూల్డ్ క్యాస్ట్ డిడి శ్రీలత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆమె వెంటనే తన పద్ధతి మార్చుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. 16 నెలలుగా వేతనాలు చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను ఆపివేయడం, బదిలీలు చేయడం వంటి చర్యలను ఆయన ఖండించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న వర్కర్స్‌పై షెడ్యూల్డ్ క్యాస్ట్ డిడి శ్రీలత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ఆమె వెంటనే తన ఆలోచన మార్చుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.
భద్రాచలంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న వర్కర్స్కు 16 నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా, గ్రీవెన్స్ లో కలెక్టర్‌కు తెలియజేసినందుకు వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కొందరి ఉద్యోగాలను ఆపివేయడం, మగవారిని ఆడవారి హాస్టల్స్‌కు, ఆడవారిని మగవారి హాస్టల్స్‌కు ఎటువంటి రిలీవింగ్ ఆర్డర్ లేకుండా బదిలీ చేయడం, వాచ్మెన్లను స్వీపర్లుగా, స్వీపర్లను కుక్లుగా, కుక్‌లను హెల్పర్లుగా మారుస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పనిలోకి రాకపోతే డ్యూటీ నుంచి తీసేస్తామని చెబుతూ, ఎటువంటి ఆర్డర్లు లేకుండా కొందరి డ్యూటీని నిలిపివేశారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. వెంటనే ఎస్సీ డిడి శ్రీలతపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలకు, 5 నుండి 10 వేల మధ్య వేతనాలతో కుటుంబ జీవనం గడుపుకుంటున్నారని, ఇప్పుడు అకస్మాత్తుగా నిబంధనలకు విరుద్ధంగా వేరే హాస్టల్స్‌కు పంపడం వలన రూమ్ రెంట్లు కట్టలేక, పిల్లలను చదివించలేక, అనారోగ్యాల పాలై ఆరోగ్యం చూపించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి పెండింగ్ వేతనాలు మొత్తం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 16 నెలలుగా హాస్టల్స్‌లో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఈ వర్కర్స్‌పై జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించి, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న శ్రీలతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో POW నాయకురాలు మడకం సమ్మక్క, PYL నాయకులు మట్ట నరసింహారావు, కారం జై రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












