అంబాజీపేట, 4 July
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య వివాదం తలెత్తింది. హెచ్ఎం కడలి సాయిరాం తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరుపై హెచ్ఎం ఆరోపణలు చేయడంతో ఈ వివాదం జిల్లా విద్యాశాఖాధికారుల వరకు చేరింది. దీనిపై కొత్తపేట డీవైఈవో వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదంపై కొత్తపేట డీవైఈవో వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు.
హెచ్ఎం కడలి సాయిరాం ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శించగా, ఉపాధ్యాయుల పనితీరు సక్రమంగా లేదని హెచ్ఎం ఆరోపించారు. ఈ పంచాయితీ జిల్లా విద్యాశాఖాధికారులకు చేరడంతో, డీఈవో ఆదేశాల మేరకు గురువారం కొత్తపేట ఇన్‌ఛార్జి డీవైఈవో విచారణ జరిపారు.
మొత్తం 25 మందిని విచారించామని, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డీవైఈవో తెలిపారు. స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన హెచ్ఎంతో పాటు మరో ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగా దూషించుకున్న వీడియోలు, వీటిని కూటమి ప్రభుత్వంలోని ఓ నాయకుడికి కొంతమంది చేరవేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఉపాధ్యాయులు కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే పనితీరు బాలేదని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం చోద్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే అంబాజీపేట హైస్కూల్‌పై అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












