సహస్ర (సహస్ర) జూలై 04
నదీ తీర క్షీణత నివారణకు సమగ్ర ప్రతిపాదనను 30 రోజుల్లోగా జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ)కి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నదీ గట్టు కోతకు శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనంతో ప్రతిపాదన రూపొందించాలని సూచించారు.
నదీ తీర క్షీణత నివారణపై సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను, నిపుణులను ఆదేశించారు. నదీ గట్టు కోతకు శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని, ఈ ప్రతిపాదనను 30 రోజుల్లో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ)కి సమర్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో, ఎన్డీఎంఏకు సమర్పించనున్న సమగ్ర ప్రతిపాదన రూపకల్పనపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. నదీ గట్టు కోత, నదీ ద్వీపాల క్షీణత, తీర ప్రాంతాల కోతకు శాశ్వత పరిష్కారాలపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇంజినీరింగ్, పర్యావరణ, సామాజిక అంశాలను సమన్వయం చేస్తూ ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ, సీఎస్ఐఆర్–ఎన్ఐఓ శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో సమన్వయంగా కార్యాచరణ జరగాలని, సుమారు 30 రోజుల్లో ప్రతిపాదన సిద్ధం చేసి ఎన్డీఎంఏకు సమర్పించాలని నిర్ణయించారు. ప్రతిపాదన ఖరారు కోసం పలు వర్చువల్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.












