Charla, జూలై 2
చర్ల మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, ఉప సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ పాఠశాల లక్ష్యం.
చర్ల మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాగలక్ష్మి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రతి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. దేవమణి మాట్లాడుతూ, ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లలకు ఆటల ద్వారా అభ్యాసం, నాణ్యమైన బోధన అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులను ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. రవిచంద్ర, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












