Dhumugudam, 2026-07-04
దుమ్ముగూడెం మండలం, నరసాపురం అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తొలిముద్ద" అల్పాహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి తెల్లం సీతమ్మ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తొలిముద్ద" అల్పాహారం కార్యక్రమం దుమ్ముగూడెం మండలం, నరసాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి భద్రాచలం గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి తెల్లం సీతమ్మ ముఖ్య అతిథులుగా హాజరై అంగన్వాడీ చిన్నారులకు తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, వారి భవిష్యత్తు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్లం హరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.












