Charla, 21-07-2026
చర్ల మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆదివారం విశ్వ కోయ-గోండి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోయ-గోండి భాషలు ఆదివాసీల సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవానికి ప్రతీకలని, భావితరాలకు ఈ భాషను అందించేందుకు ప్రతి కుటుంబం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జూలై 21 సందర్భంగా నిర్వహిస్తున్న విశ్వ కోయ-గోండి భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చర్ల మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు కలిసి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కోయ-గోండి భాషలు ఆదివాసీల సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవానికి ప్రతీకలని అన్నారు. మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఆదివాసి బాధ్యత అని, భావితరాలకు కోయ-గోండి భాషను అందించేందుకు ప్రతి కుటుంబం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు కోయ-గోండి భాషల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి, పాఠశాలల్లో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆదివాసీ భాషలకు తగిన గుర్తింపు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చర్ల మండలం ఆదివాసీ జేఏసీ చైర్మన్ వాసం. ముసలయ్య, నూగురు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప. శ్రీనివాస్, ఇరప. రాజు దొర, పూనెం. వరప్రసాద్, ఆదివాసీ మహిళా జేఏసీ ఇరప. ప్రకాష్ దొర, ఇరప. అపర్ణ, బీరబోయిన. రాణి, కోరం. బిక్షపతి, తాటి. వెంకటరావు, బీరబోయిన. శేఖర్, కలం. శ్రీను, సరేం. హరిదీప్, మడప. అనిల్ ఆదివాసీ జేఏసీ నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళా నాయకులు, కోయ-గోండి భాషాభిమానులు మరియు పలువురు ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. 'జల్ – జంగల్ – జమీన్ మా హక్కు', 'కోయ-గోండి భాష మా ఆత్మగౌరవం' నినాదాలు చేశారు.











