హైదరాబాద్, 2026-06-05
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ బాలానగర్ సి ఓ ఈ కళాశాలలో చదువుకుని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ హిమ్మిడి శ్రీనివాసులు, అధ్యాపకులు ఘనంగా సత్కరించి అవార్డులు అందజేశారు.

పట్టుదలతో లక్ష్య సాధన
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, డర్ర రఘురాం లాగా పట్టుదలతో చదివితే లక్ష్యాలను సాధించుకోవచ్చని నిరూపించారని అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యకు బాలానగర్ సి ఓ ఈ కళాశాల పెద్దపీట వేస్తోందని, పేద, నిరుపేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో ఈ కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాల్లో సీట్లు
మా కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కే పురం గ్రామానికి చెందిన డర్ర రఘురాం అనే విద్యార్థికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ హిస్టరీలో సీటు సాధించడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. అలాగే, హైదరాబాద్ వాసి అయిన రెండవ విద్యార్థి షయానుల్లా ఖాన్, ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించి ప్రవేశం పొందడం కూడా తమ కళాశాలకు గర్వకారణమని అన్నారు.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమంలో సి ఓ ఈ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.