ములుగు, 2026-06-05
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కస్తూర్బా బాలికల హాస్టల్లో బాలికల హక్కుల పరిరక్షణ, అవగాహన మరియు స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాన్ని కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీచర్ పి. సూర్యనారాయణ, కస్తూర్బా పిటికె శైలజ పాల్గొన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కస్తూర్బా బాలికల హాస్టల్లో బాలికల హక్కుల పరిరక్షణ, అవగాహన మరియు స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాన్ని కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీచర్ పి. సూర్యనారాయణ, కస్తూర్బా పిటికె శైలజ పాల్గొన్నారు. బాలికల హక్కులను పరిరక్షించడం, వారికి తమ హక్కులపై అవగాహన కల్పించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, స్వీయ రక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని సూర్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు బాలల హక్కులు, విద్యా హక్కు, రక్షణ హక్కు, సమానత్వం, బాల్య వివాహాల నివారణ, సురక్షితమైన వాతావరణం, తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా, బాలికలు ప్రమాదకర పరిస్థితుల్లో తమను తాము సురక్షితంగా కాపాడుకునేందుకు ప్రాథమిక స్వీయ రక్షణ శిక్షణ అందిస్తారు. అవసరమైనప్పుడు నమ్మకమైన పెద్దలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను లేదా సంబంధిత సహాయ వ్యవస్థలను సంప్రదించాల్సిన ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు.
కేర్ అండ్ షేర్ భావన ద్వారా బాలికలు ఒకరినొకరు గౌరవించుకోవడం, సహాయం చేసుకోవడం, సమస్యలను పంచుకోవడం, పరస్పరం ప్రోత్సహించుకోవడం నేర్చుకుంటారు. బాలికల భద్రత, గౌరవం, హక్కులు, భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. ప్రతి బాలిక భయంలేకుండా, ఆత్మవిశ్వాసంతో, సురక్షితమైన వాతావరణంలో ఎదగడానికి ఇటువంటి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలియజేశారు.
అదేవిధంగా, పిటికె శైలజ యోగ శిక్షణ ఇచ్చారు. యోగ చేయడం వలన శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుందని, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి సహాయపడుతుందని తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ 5వ డాన్ జి హనుమంత్ బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ (స్వీయ రక్షణ) పై కరాటే నేర్పించారు. కరాటే వల్ల శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, సరైన సమయంలో స్వీయ రక్షణ గురించి అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్, యానిమేటర్లు ఉషా, ఇందిరా, పద్మ, ప్రశాంత్, నరేశ్, కస్తూర్బా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.


