Charla, జూలై 15
చర్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన రామచంద్రపురం, కిష్టారంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతూ చర్ల మండల యూత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వసంతికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పాఠశాలలు సరైన భవనాలు, కనీస వసతులు లేక గుడిసెల్లో కొనసాగుతున్నాయని, వర్షాల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చర్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన రామచంద్రపురం, కిష్టారంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి, అవసరమైన తరగతి గదులను మంజూరు చేయాలని చర్ల మండల యూత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వసంతికి బుధవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యువ న్యాయవాది పరిటాల సంతోష్ మాట్లాడుతూ, రెండు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం సరైన భవనాలు, కనీస వసతులు లేక గుడిసెల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో గాలి, వర్షం కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరగతులు సక్రమంగా నిర్వహించలేక విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు.
ఈ గ్రామాలు పూర్తిగా మారుమూల గిరిజన ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించే లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా సురక్షితమైన, శాశ్వత పాఠశాల భవనాలు నిర్మించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వెంటనే స్పందించి నూతన భవనాలు, అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు.
ఈ కార్యక్రమంలో పరిటాల సంతోష్, బోరా పెద్దిరెడ్డి, అలవాల మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











