ములుగు, 2026-07-10
ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంకటాపురం మండల వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు ఎస్ఎఫ్ఐ నాయకులు కొప్పుల రవికుమార్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం వెంకటాపురం మండల వ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు కొప్పుల రవికుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్కు నూతన భవనం మంజూరు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, తరగతి గదులు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.
అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య హక్కును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాలు, మహేందర్, జోష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.












