కొత్తపేట, గురువారం
అక్రమ మట్టి రవాణాను అడ్డుకుంటూ కొత్తపేట పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మైన్స్ శాఖ అధికారులకు అప్పగించారు.
అక్రమ మట్టి రవాణాపై కొత్తపేట పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మడుపెల్ల ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న లారీలను గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు సమాచారం అందించి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అప్పగించినట్లు కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర తెలిపారు.












