సహస్ర (సహస్ర) జూన్ 29
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న పదవీ విరమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న పదవీ విరమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సేవలనుంచి రిలీవ్ చేస్తూ జీఓ ఆర్టీ నెం.1274 జారీ చేశారు. అయితే, పెండింగ్లో ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా కేసుల విచారణపై ప్రభావం ఉండదని, పెన్షన్ ప్రయోజనాలు నిబంధనల మేరకే అమలవుతాయని తెలిపారు. డీజీపీకి తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెన్షన్లోనే పదవీ విరమణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సునీల్ కుమార్ రేపు పదవీ విరమణ పొందనున్న ఐపీఎస్ అధికారి.











