డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, సోమవారం
బేడ.బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, రాయితీలు అందక నష్టపోతున్నారని అన్నారు.
బేడ.బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బేడ బుడగ జంగం కులానికి ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారికి అందాల్సిన రాయితీలు అందక నష్టపోతున్నారని ఆయన అన్నారు. వీరికి వెంటనే బుడగజంగాలుగా సర్టిఫికెట్ల మంజూరు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా వీరిని నమోదు చేయాలని ఆయన కోరారు. కుల సర్టిఫికెట్ లేకపోవడంతో పై తరగతులు చదవడానికి ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రభుత్వాలు మారుతున్నా వీరికి బుడగ జంగాలుగా ఎస్సీ సర్టిఫికెట్లు అందజేయడంలో జాప్యం జరుగుతోందని, తమ కులానికి ఇంతేనా అంటూ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కుల సర్టిఫికెట్లను ఎందుకు గుర్తించడం లేదని బుడగజంగాలు వాపోతున్నారని, విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి వారి డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వీరి సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.











