Charla, జూన్ 30
చర్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ కలెక్టర్ ఎం. మురళి, ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణమూర్తిలను చర్ల మండల సర్పంచులు ఘనంగా సన్మానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చర్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ కలెక్టర్ ఎం. మురళి, ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణమూర్తిలను చర్ల మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అధికారులు గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు ప్రజాప్రతినిధులు–అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్పంచులు కూడా గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చర్ల మండలానికి చెందిన పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












