రాజోలు / చింతలపల్లి (సహస్ర) జూన్ 30
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి కళింగల వద్ద విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సును ఒక స్విఫ్ట్ కారు (AP05 CR 9729) ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి కళింగల వద్ద ప్రమాద మలుపు వద్ద కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న అమలాపురం శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్విఫ్ట్ కారు (AP05 CR 9729) బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు.
కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.












