దుమ్మగూడెం మండలంలో గురువారం (25-06-2026) నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేలో బూత్ లెవెల్ అధికారులు, పార్టీ ఏజెంట్లు పాల్గొంటారు.
దుమ్మగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ నుండి మండలంలోని అన్ని గ్రామాలలో ఓటర్ల సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ సర్వే ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు (BLO) మరియు పార్టీ తరపున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. దుమ్మగూడెం మండలంలో మొత్తం 40 ఎన్నికల బూత్‌లు ఉన్నాయని, ప్రతి బూత్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు.
ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ తమకు కేటాయించిన బూత్ పరిధిలోని BLO అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి గ్రామంలో సర్వే పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడటం, ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం పార్టీ అందరి బాధ్యత అని తెలిపారు.
ఈ నేపథ్యంలో, ప్రతి గ్రామంలోని ఓటర్లను చైతన్యవంతం చేయాలని, ముందుగానే సమాచారం అందిస్తూ, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలని పార్టీ అధ్యక్షులు కోరారు.












