వెంకటాపురం, 2026-06-05
ఉన్నత విద్యనభ్యసించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న ఉయిక శిరీష మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వెంకటాపురం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యనభ్యసించి తమ కుటుంబాన్ని ఆదుకుంటుందని కలలు కన్న ఉయిక శిరీష ఆశలను ఒక కామాంధుడి కారణంగా ఆవిరైపోయాయని, ఆమె మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వెంకటాపురం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వెంకటాపురం వేదికగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన
తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మహిళలకు రక్షణ లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేతకాని కాంగ్రెస్ పాలన వల్లే ఆదివాసీ బిడ్డ ఉయిక శిరీష లోకాన్ని విడిచి వెళ్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దౌర్భాగ్య పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు.
ఆదివాసీ ఎమ్మెల్యేల రాజీనామా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని గంప రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేల రాజీనామానే ఉయిక శిరీషకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. శిరీష కుటుంబానికి వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








