భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-21
ప్రముఖ కాంట్రాక్టర్, అభిల హాస్పిటల్ చైర్మన్ శ్రీ జవ్వాది ఉమా మహేశ్వరరావు గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, చర్ల BRS పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారు, పంజా రాజు, కాకి అనిల్ తదితరులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. ఉమా మహేశ్వరరావు మృతి చర్ల ఏజెన్సీ ప్రజలకు తీరని లోటని వారు పేర్కొన్నారు.
నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కాంట్రాక్టర్, అభిల హాస్పిటల్ చైర్మన్ శ్రీ జవ్వాది ఉమా మహేశ్వరరావు గారిని పరామర్శించేందుకు చర్ల BRS పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారు, పంజా రాజు, కాకి అనిల్ తదితరులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దొడ్డి తాతారావు గారు మాట్లాడుతూ, ఉమా మహేశ్వరరావు గారి మరణం చర్ల మండలానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో చర్ల ఏజెన్సీ ప్రజలకు హాస్పిటల్ ఏర్పాటు చేసి, అత్యవసర వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.












