భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ శబరి బాలికా నిలయ స్దలదాత, గుంటూరు వాసి జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. కోదండ రాంబాబు - సుమతి రామ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వనవాసీ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థి నిలయాలకు 50 కేజీల బియ్యంతో పాటు భోజనం, పండ్లు, స్వీట్స్ ఏర్పాటు చేశారు.
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ శబరి బాలికా నిలయ స్దలదాత, గుంటూరు వాసి జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. కోదండ రాంబాబు - సుమతి రామ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వనవాసీ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థి నిలయాలకు 50 కేజీల బియ్యంతో పాటు విద్యార్థులకు భోజనం, పండ్లు, స్వీట్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదండ రాంబాబు, సుమతి రామ్ లు మాట్లాడారు. విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా చదువులపైనే శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని, చదువుకొని ఉద్యోగం సాధించిన వారు ఉన్నత స్థితిలో ఉన్నారని, ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలని సూచించారు.
వనవాసీ కళ్యాణ పరిషత్ సంస్థ స్థాపన గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకే ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకొని క్రమశిక్షణతో మెలగి సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చర్లలో శబరి పేరిట బాలికా నిలయం ఏర్పాటు చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు దాతల సహకారం సైతం మరువలేనిదని అన్నారు.
సంస్థకు ప్రభుత్వాల నుండి ఎటువంటి ఆదాయం సమకూరదని, కేవలం దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నామని, ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని దాతలు సహకరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. విద్యార్థులు దాతల నమ్మకానికి అనుగుణంగా విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, కొమరం భీం విద్యార్థి నిలయం అధ్యక్షుడు తాటి పాపారావు, ఉప కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, జవ్వాది శ్రీకాంత్, జవ్వాది శ్రీనివాస్, లవన్ కుమార్ రెడ్డి, కొమరం భీం నిలయ ప్రముఖ్ సాంబయ్య, శబరి బాలికా నిలయ ప్రముఖ్ వరలక్ష్మి పాల్గొన్నారు.












