భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని యతీరాజ్యం. అస్మిత, ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులకు 485 మార్కులు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాపర్ గా నిలిచింది. ఆఫీస్ అసిస్టెంట్షిప్ గ్రూప్ లో ఆమె ఈ ఘనత సాధించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల, భద్రాచలం లో వృత్తివిద్య కోర్సు, ఆఫీస్ అసిస్టెంట్షిప్ గ్రూప్ లో మొదటి సంవత్సరం చదువుతున్న యతీరాజ్యం. అస్మిత, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి జిల్లా స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిగా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి సుధాకర్ రెడ్డి, ఆఫీస్ అసిస్టెంట్షిప్ గ్రూప్ అధ్యాపకులు జె. శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరావు మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
యతీరాజ్యం. అస్మిత తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నప్పటికీ, విద్యార్థిని తన ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి అత్యున్నత మార్కులు సాధించింది. ఆమె నిబద్ధత, కృషి అనేక మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయి.
ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాదని, సరైన ప్రణాళిక, పట్టుదలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని యతీరాజ్యం. అస్మిత విజయం నిరూపించింది. కళాశాల యాజమాన్యం ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది.







