
స్మార్ట్ఫోన్ వాడకం తెలియని లేదా సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక 'ఫర్టిలైజర్ యాప్' ద్వారా యూరియా బుక్ చేసుకోలేని వారికి మీసేవ కేంద్రాల ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 10 నామినల్ రుసుముతో రైతులు తమకు కావలసిన యూరియాను మీసేవ సెంటర్ల ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.



















