ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి సమగ్రాభివృద్ధికై తోడ్పడాలని ఉపాధ్యాయురాలు దేశ అమ్మాజి పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె పలు గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే విద్యాబోధన, మౌలిక సదుపాయాల గురించి దేశ అమ్మాజి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు.
ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ, విశాలమైన తరగతి గదులు, ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం వంటి సౌకర్యాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మధ్యాహ్న భోజనం, సురక్షిత మంచినీరు, డిజిటల్ క్లాసులు, సైన్స్ ప్రయోగశాల, ఉచిత వైద్య పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా పిల్లల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం చేయవచ్చని ఆమె తల్లిదండ్రులను కోరారు.






