** (సహస్ర) జూలై 02
ఏటూరు నాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ కు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు, ఆదివాసి సమస్యలపై మెమోరాండం ఇవ్వబడింది. ఏజెన్సీ ప్రాంతంలో అంగన్వాడీ పోస్టుల భర్తీలో 100% ఆదివాసి మహిళలకే కేటాయించాలని పరిషత్ డిమాండ్ చేసింది. ములుగు జిల్లా అధ్యక్షులు పర్శిక సతీష్ ఈ మేరకు కోరారు.
ఏటూరు నాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ గారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు, ఆదివాసి సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పర్శిక సతీష్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలు, ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు అమలు చేయాలని అన్నారు.
ఏజెన్సీ ప్రాంత ములుగు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 100% అంగన్వాడీ టీచర్స్, ఆయా పోస్టులు ఆదివాసి మహిళలకు కేటాయించాలని కోరారు. వెంకటాపురం (మం) ఆలుబాక (గ్రా,పం) ముత్తారం గ్రామంలో రెండు సంవత్సరాల ముత్తారం - 2 అంగన్వాడి కేంద్రం నడుస్తున్నది. ఆ గ్రామంలో 100 కుటుంబాలు కలవు, 16 మంది 0-6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు.
మొదటి విడత కింద జారీ చేసిన నోటిఫికేషన్ లో ముత్తారం 2 టీచర్ నియామకం లేకపోవడం అక్కడ ఆదివాసి పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుబంధ పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య ఐ.సి.డి.ఎస్ పథకం కింద సేవలందించడం కొరకు ముత్తారం గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు, కుంజ సూరిబాబు, సోడి గోపి, కాక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.











