Charla, జూన్ 28
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతిని పురస్కరించుకుని చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళి హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండెపూడి భాస్కర్ రావు, లంక రాజు, సత్తిబాబు, వాసు, రాయుడు తదితరులు పాల్గొని పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సరికొత్త ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దార్శనిక నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త, నిరాడంబర ప్రజానాయకుడిగా, తెలంగాణ గర్వకారణంగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు ఆశయాలు, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలిన లంక రాజు, మేడబట్టిన వాసు, గోగాల సంధ్య, కానీతి శిరీష, కాక శ్రీవిద్య, మచ్చ వరలక్ష్మి, యాడిల సుజాత, శివ సంపత్, హర్ష రెడ్డి, బాలకృష్ణ, రాకేష్, బాబీ, సాగర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












