అమలాపురం, జులై 01
సమాజంలోని సమస్యలపై పత్రికలు నిర్భయంగా పని చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ రావు అన్నారు. నూతనంగా ప్రారంభమైన 'ఉదయనేత్రం' దినపత్రికను ఆయనకు అందించిన సందర్భంగా ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా నిలవాలని సూచించారు.
సమాజంలోని సమస్యలపై పత్రికలు నిర్భయంగా పని చేయాలని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ రావు అన్నారు. నూతనంగా వెలువడుతున్న 'ఉదయనేత్రం' దినపత్రికను బుధవారం ఆ పత్రిక ఎడిటర్ కడలి రాజు ఎమ్మెల్సీ కుడుపూడికి అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
సమాజంలో ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేవే నిజమైన దినపత్రికలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల సాధకబాధకాలను, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా 'ఉదయనేత్రం' దినపత్రిక యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడలి సూరిబాబు, అద్దంకి భాస్కర్, ముంగర ప్రసాద్, గబ్రీయేల్ తదితరులు పాల్గొన్నారు.












