రాజోలు / శివకోడు (సహస్ర) జూలై 01
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శివకోడు నేషనల్ హైవేపై ఖాళీ బ్రాందీ, బీరు సీసాలు పెద్ద ఎత్తున రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సీసాలపై నుంచి వాహనాలు వెళ్లడంతో అవి పగిలి, రహదారి అంతా గాజు పెంకులతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే, మద్యం సీసాల లోడ్ తీసుకెళ్తున్న ఓ లారీలో నుంచి సీసాలు జారి రోడ్డుపై పడ్డాయి. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి దిగి పరిశీలించినప్పటికీ, వాటిని తొలగించే చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో రహదారి ప్రమాదకరంగా మారింది.
ప్రమాదకరంగా మారిన ఈ రహదారిని వెంటనే శుభ్రం చేయాలని, ఘటనపై విచారణ చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.