భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-24
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను చర్ల బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ సేవలను పలువురు నాయకులు కొనియాడారు.
చర్ల బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి 50వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణ, ఐటీ ప్రగతి, యువతకు ఉపాధి కల్పనలో కేటీఆర్ గారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అది ఆయన చొరవేనని అన్నారు. సుస్థిర పాలన, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, దేశవ్యాప్తంగా యువ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
గులాబీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని ఘన విజయాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, తోటపల్లి మాధవరావు, దినసరపు భాస్కర్ రెడ్డి, పంజా రాజు, కాకి అనిల్, కొంబత్తిని రాంబాబు, గోరింట్ల వెంకటేశ్వరరావు, బొజ్జ సాయి ప్రణయ్ (బాచి), బేతంచర్ల నర్స వేణి, ఉప్పరి గూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి, పెద్ద ముసీలేరు సర్పంచ్ బెండ బోయిన సుహాసిని, తేగడ సర్పంచ్ మురళి, పాశిగంటి సంధ్య, పాశిగంటి సంతోష్, కవ్వాల రాము, సింగ సంతోష్ రావుల కిషోర్, ఎడ్ల రామదాసు, తెల్లం లక్ష్మీనారాయణ, మామిడి రాజు, బట్ట కొమరయ్య, గుమ్మల నరేంద్ర, గుమ్మల సత్యనారాయణ, దుబ్బ సమ్మయ్య, సాదిక్, గాదంశెట్టి కిషోర్, సృజన్, కుకడపు సాయి, ఎర్రావుల ప్రేమ్, వంకాయల వినోద్ తదితరులు పాల్గొన్నారు.











