అమలాపురం, సోమవారం
అమలాపురం పట్టణానికి చెందిన బొంతు రమణను విముక్త చిరుతల కక్షి (వీసీకే) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఒంగోలులో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
విముక్త చిరుతల కక్షి (వీసీకే) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన బొంతు రమణను నియమించినట్లు ఆయన మీడియాకు సోమవారం తెలిపారు. ఒంగోలులో జరిగిన వీసీకే పార్టీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో తనను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నట్లు రమణ పేర్కొన్నారు.
పార్టీని ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లేందుకు సాయిశక్తుల కృషి చేస్తానని రమణ స్పష్టం చేశారు. తనకు ఈ పదవి కేటాయించినందుకు వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జె. విద్యాసాగర్, జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు తిరుమలవలనన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.










