ములుగు, శుక్రవారం
ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో నిద్రపోతున్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకుడవలతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వేటకుడవలతో యువకుడిపై దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కడేకల్ పంచాయతీ దుబ్బగూడెం గ్రామానికి చెందిన మడే చలపతి (35) నిద్రలో ఉండగా, పదునైన ఆయుధాలతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల నుండి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.
హంతకుల ఆచూకీ కోసం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపినట్లు, హత్యకు గురైన స్థలాల్లో ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.
గ్రామాల్లో ఇటువంటి సంఘటన జరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ సంఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.











