పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం 7:30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. మేడారం, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉదయం 9:00 గంటలకు తాడ్వాయి మండలం మేడారం పరిధిలోని సమ్మక్క–సారలమ్మ దేవస్థానం ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మేడారంలో జరిగిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. 09:45 గంటలకు మేడారంలో వన మహోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
మధ్యాహ్నం 11:00 గంటలకు మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని హేమచల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు.
మధ్యాహ్నం 2:00 గంటలకు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ అధికారులు, సర్పంచ్ల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. సాయంత్రం 4:00 గంటలకు వాజేడు మండలంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. 04:40 గంటలకు వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని సందర్శించారు.










