తెలంగాణ, 2026-09-05
కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో మంగళవారం కోరారు. ఈ నెల 7వ తేదీన ప్రతినిధుల బృందాన్ని కొత్తగూడెం పంపిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులకు ఈ విమానాశ్రయం సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన ప్రతినిధుల బృందాన్ని కొత్తగూడెం పంపిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఈ విమానాశ్రయం సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి, సివిల్ ఏవియేషన్ తరపున ఫీజిబిలిటీ సర్వే చేసినందుకు రామ్మోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున, మరో స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదించామని, అక్కడ ఫీజిబిలిటీ సర్వే నివేదిక సిద్ధమైందని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
మంత్రి తుమ్మల విజ్ఞప్తి
మంత్రి తుమ్మల మాట్లాడుతూ, దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీ.పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అరుదైన ఖనిజ నిక్షేపాలతో, అటవీ ప్రాంతంతో ఎకో టూరిజంకు కేరాఫ్‌గా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేశామని తెలిపారు.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా, విద్యాపరంగా, టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశవిదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని రామ్మోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రామ్మోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.












