Charla, July 4, Saturday
తేగడ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా, గణపతికి సిద్ధి బుద్ధి సమేతంగా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుండి గణపతికి పంచామృత అభిషేకం, గరికతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించారు.
తేగడ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా, అంతర మండపంలో ఉన్న గణపతికి సిద్ధి బుద్ధి సమేతంగా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
శనివారం తెల్లవారుజామున 4 గంటల నుండి గణపతికి పంచామృత అభిషేకం, ఆ తర్వాత గరికతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మహా గణపతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
కళ్యాణంలో భాగంగా ముందుగా పసుపు గణపతి పూజ, బాసిక ధారణ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, షటారీ (స్వామి వారికి కాళ్ళు కడుగుట), మధుపర్క ప్రాశన, గోత్ర ప్రవరలు, కన్యాదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ నిర్వాహకులు యల్లమందల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు యల్లమందల భాను ప్రకాష్ కళ్యాణ క్రియలను నిర్వహించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న భక్తులకు, దాతలకు అనేక మంగళా శాసనాలను అర్చకులు తెలియజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది అతి పురాతన, మహా మహిమాన్విత భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయం అని అర్చకులు తెలిపారు.












