Charla, 04-08-2026
రలపరాథమికఆరోగయకేదరలోజరిగినఆశాేసమావేశలోీఎశరీధరగారుపాలగొననారు.ఆశాకారయకరతలకు,ఆరోగయసిబబదికిఆయనపలుకీలకసూనలుేశారు.
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఆశా డే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ డీఎంఅండ్హెచ్ఓ శ్రీధర్ గారు హాజరై, ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ఆగస్టు మాసపు థీమ్ అయిన యుక్త వయస్సులో వచ్చే రక్తహీనత (అనీమియా) నివారణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాముఖ్యత, ఐఎఫ్ఏ మాత్రల వాడకం గురించి వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా రెగ్యులర్ విజిట్స్ చేయాలని, ప్రతి జ్వర కేసును ఫాలో-అప్ చేయాలని శ్రీధర్ గారు ఆదేశించారు. ప్రతి జ్వర కేసుకు మలేరియా ఆర్డీటీ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. అలాగే, మన గ్రామాల నుండి ఛత్తీస్గఢ్ వెళ్లి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారిని నిరంతరం ఫాలో-అప్ చేయడం ద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో ముందస్తు చర్యల గురించి కూడా ఆయన చర్చించారు. గ్రామాలలోని గర్భిణీ స్త్రీల సమాచారం, ముఖ్యంగా డెలివరీ తేదీ దగ్గరగా ఉన్న వారి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈడీడీ దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీహెచ్సీ ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆశా కార్యకర్తలు తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో డా. హారిక (మెడికల్ ఆఫీసర్), పాయం శ్రీను (డీపీఎంఓ), హెల్త్ సూపర్వైజర్ పి. కృష్ణయ్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.








