Visakhapatnam/Padmanabham (సహస్ర) ఆగస్టు 04
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో () జరిగిన ఆశా డే సమావేశానికి . శ్రీధర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి రక్తహీనత నివారణ, దోమల నివారణ, జ్వరాల పర్యవేక్షణ, వలసలపై నిఘా, వరదల దృష్ట్యా ముందస్తు చర్యలపై కీలక సూచనలు చేశారు.
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో () గురువారం (04-08-2026) జరిగిన ఆశా డే సమావేశాన్ని గౌరవ . శ్రీధర్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు.
ఆగష్టు నెల థీమ్ అయిన యుక్త వయస్సులో వచ్చే రక్తహీనత () గురించి, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, మాత్రల ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు.
ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో రెగ్యులర్ విజిట్స్ తప్పనిసరిగా చేయాలని, ప్రతి జ్వర కేసును ఫాలో-అప్ చేయాలని, ప్రతి జ్వర కేసుకు మలేరియా పరీక్ష తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.
మన గ్రామాల నుండి ఛత్తీస్గఢ్ (.) వెళ్లి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారిని నిరంతరం ఫాలో-అప్ చేయాలని, ఇది మలేరియా వ్యాప్తి నిరోధానికి చాలా ముఖ్యం అని తెలిపారు.
వర్షాలు, వరదల కారణంగా వాగులు పొంగే, గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, గ్రామాలలోని గర్భిణీ స్త్రీలందరి సమాచారం, ముఖ్యంగా ( ) దగ్గరగా ఉన్న వారి జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందుగానే / / ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేయాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆశా కార్యకర్త ఉన్న తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డా. హారిక గారు (మెడికల్ ఆఫీసర్), పాయం శ్రీను గారు (), హెల్త్ సూపర్ వైజర్ . కృష్ణయ్య గారు, ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.








