20 నవంబర్ 26 డాక్సిన్ టైమ్స్
భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసం వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని విస్తరించడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు (), వైద్య సాంకేతికత, రక్షణ తయారీ, ఔషధ రంగం, స్వచ్ఛ ఇంధనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్అమెరికా కలిసి పనిచేయాలని ఓం బిర్లా సూచించారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఐటీలు, ఇంజినీరింగ్ కళాశాలల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధి () కోసం పెట్టుబడులు పెడితే కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, దేశీయ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. భారత ఔషధాలకు ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంచి గుర్తింపు ఉందని, భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పరిశోధనలు చేయాలని సూచించారు.
భారత్‌లోని యువత నైపుణ్యాలు, ఆలోచనలు, సృజనాత్మకత దేశ అభివృద్ధికి ప్రధాన బలమని ఓం బిర్లా పేర్కొన్నారు. భారత స్టార్టప్ వ్యవస్థ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందిస్తోందని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (లు) పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయని వివరించారు. భారత్, అమెరికా సంస్థలు తమ తమ బలాలను ఉపయోగించుకుని అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు.
పరిశ్రమల విస్తరణ, డేటా సెంటర్ల పెరుగుదల, కొత్త సాంకేతిక పెట్టుబడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని ఓం బిర్లా తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. స్వచ్ఛమైన, హరిత ఇంధన రంగాల్లో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తే కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశాలని ఓం బిర్లా చెప్పారు. విధానాల రూపకల్పనలో పరిశ్రమలు, వ్యవసాయం, సాంకేతిక రంగం, విద్యార్థులు సహా వివిధ వర్గాల అభిప్రాయాలకు చోటు కల్పించాలని సూచించారు.
1968 నుంచి భారత్అమెరికా ఆర్థిక సంబంధాల అభివృద్ధికి ఇండోఅమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. వసుధైవ కుటుంబకం అనే భారతీయ భావనకు అనుగుణంగా దేశాలు పరస్పర గౌరవంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జరిగిన చర్చలు వాణిజ్యం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో కొత్త భాగస్వామ్యాలకు దారితీస్తాయని ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని విస్తరించాలని, యువత, స్టార్టప్‌లు, లకు అవకాశాలు కల్పించాలని సూచించారు. , క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.






