రామచంద్రపురం, 1 July
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలను కాపాడే ప్రతి వైద్యుడు నడిచే దైవమని, సమాజానికి వారి సేవలు అమూల్యమని ఆయన అన్నారు. రోగికి ధైర్యాన్ని, కుటుంబానికి భరోసాను అందించే బాధ్యతను వైద్యులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలను కాపాడే ప్రతి వైద్యుడు నడిచే దైవమని, సమాజానికి వారి సేవలు అమూల్యమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "వైద్యో నారాయణో హరిః" అనే భారతీయ సంస్కృతి వైద్య వృత్తి గొప్పతనానికి ప్రతీక అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేసి, నిరాశలో ఉన్న కుటుంబాలకు ఆశను నింపుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా సేవలందించే వైద్యులు నిజంగా నడిచే దైవాలని కొనియాడారు.
రోగిని కేవలం చికిత్స చేయడమే కాకుండా, అతనికి ధైర్యాన్ని, కుటుంబానికి భరోసాను అందించే మహోన్నత బాధ్యతను వైద్యులు నిర్వర్తిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పగలు-రాత్రి అనే తేడా లేకుండా, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి వైద్యుడి సేవ సమాజానికి అమూల్యమైనదని అన్నారు.
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యుల సేవలను దేశం ఎన్నటికీ మరువదని మంత్రి గుర్తుచేశారు. సేవ, త్యాగం, కరుణ, అంకితభావానికి ప్రతీకలైన వైద్యులు సమాజానికి స్ఫూర్తిదాయకులని అన్నారు.
ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో నిరంతరం సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. దేవుడి తర్వాత కనిపించే దైవం వైద్యుడే.. ప్రాణదాతలైన వైద్యులకు జాతి వందనం అంటూ మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలియజేశారు.










