భద్రాచలం, జూలై 10
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు భద్రాచలంలో విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న రాష్ట్రవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మునిగాల శివ ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించి, విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కోరారు.
అన్ని ఖాళీ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి కఠిన నియంత్రణలు అమలు చేయాలని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలని వారు అన్నారు.
పెండింగ్‌లో ఉన్న 7 వేల కోట్ల రూపాయల విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ వంటివి అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యను కాపాడుకోవడానికి, విద్యాహక్కును పరిరక్షించుకోవడానికి ప్రతి విద్యార్థి జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగస్వామి కావాలని, ఈ బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.











