Charla, 2026-08-02
లక్ష్మి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం వ్యవస్థాపకులు శివనాగ స్వామి అమ్మవారికి చీర జాకెట్ ను సమర్పించారు.
లక్ష్మి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ఆలయ పూజారులు పూనెం చంటి, మడకం దేవా, మరియు పెద్దలు మడకం చందు, తోలెం మల్లయ్యల సారథ్యంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవానికి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం వ్యవస్థాపకులు శివనాగ స్వామి విచ్చేసి అమ్మవారికి చీర జాకెట్ ను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే ముఖ్యమైన పండుగ బోనాల పండుగ అని అన్నారు. గ్రామంలోని ప్రజలందరి కష్టాలను పారదోలి, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తలతూగాలని మహిళలు అమ్మవారిని కొలుస్తారు. కొత్త కుండలో వండిన అన్నం, పప్పు, బెల్లం, పాలతో చేసిన వంట అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి, చల్లగా చూడు తల్లి అంటూ శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, పెద్దలు, పిల్లలు పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.










