Mahabubnagar/Devarakadra (సహస్ర) జూన్ 30
జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆదివారం (06/07/26) జాతీయ ఆదివాసీ సెమినార్ జరిగింది. 'మా ఊళ్లో—మా రాజ్యం' సాధన కోసం దేశవ్యాప్తంగా మరో పోరాటం చేపట్టాలని సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో 5వ షెడ్యూల్డ్ ప్రాంత పరిరక్షణ, ఆదివాసీల అభివృద్ధి, స్వయం పాలనతో పాటు 10 కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
జాతీయ ఆదివాసి రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో భద్రాచలం హరిత హోటల్లో ఆదివారం (06/07/26) జాతీయ ఆదివాసీ సెమినార్ నిర్వహించబడింది. 'మా ఊళ్లో—మా రాజ్యం', 'మావా నాటే—మావారాజ్యం' సాధన కోసం దేశవ్యాప్తంగా మరో పోరాటం చేపట్టాలని సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మం చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు.
ఈ సెమినార్కు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక (మాజీ శాసనసభ్యులు రత్నం నాయకత్వంలో), తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి ఆదివాసీలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంఘాలు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, అభిమానులు హాజరయ్యారు. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా పలువురు నాయకులు, బృందాలు విచ్చేసి, 6వ తేదీన జరిగే జాతీయ ఆదివాసీ సదస్సుకు హాజరయ్యారు.
ది.23-06-2026 నుండి 28-06-2026 వరకు 6 రోజులపాటు శ్రీ చందా లింగయ్య దొర గారి నాయకత్వంలో 12 మంది బృందం 'ఆదివాసి రాజ్యాంగ హక్కులు రక్షణ యాత్ర' పేరుతో ఆరు రాష్ట్రాలు తిరిగి ఆదివాసీ పెద్దలను, నాయకులను, సంఘాలను కలిసి ఆహ్వానించింది. ఈ బృందంలో శ్రీ లకే రాజారావు (మాజీ శాసనసభ్యులు, పాడేరు, ఏపీ), మాడావి నర్సింగరావు (టీజీ రాష్ట్ర కన్వీనర్), కొమరం రామ్మూర్తి (రాష్ట్ర సభ్యులు), డాక్టర్ చందా మహేష్ (PhD విద్యార్థి), గడెం తుకారాం, బాపుని బాఫురావు, గేడం రవి, సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
మహారాష్ట్ర నుండి పండల్ మార్కం, మరప బాబురావు (మాజీ మేయర్) నాయకత్వంలో, చత్తీస్గఢ్ నుండి మనీష్ కుంజాం (మాజీ ఎమ్మెల్యే), హేమలాల్ మార్కం, ఆర్.ఎన్. దుర్వే నాయకత్వంలో, ఒడిస్సా నుండి మనోజ్ మల్కం (మాజీ శాసనసభ్యులు), అడమా రెబ్బ, భీమా బూర్య, గుప్త మడి గార్ల బృందం, ఆంధ్రప్రదేశ్ నుండి లకే రాజారావు (మాజీ ఎమ్మెల్యే), కోలక లక్ష్మిమూర్తి (మాజీ ఎమ్మెల్యే), గరిగె బాబురావు, కే నాగేశ్వరరావు నాయకత్వంలో, తెలంగాణ నుండి చిడెం అర్జున్, కుర్సంగి మోతిరామ్, పొడుగు శ్రీనాథ్, పోదేంకృష్ణ ప్రసాద్, గొప్ప వీరయ్య, కొమరం రామ్మూర్తి, వజ్జ నరసింహారావు, పాయం సత్యనారాయణ నాయకత్వంలో మూడు బృందాలు హాజరయ్యాయి.
ఆరో తేదీన జరిగే జాతీయ ఆదివాసీ సదస్సులో 5వ షెడ్యూల్డ్ ప్రాంత పరిరక్షణ, ఆదివాసీల అభివృద్ధి, ఆదివాసీల స్వయం పాలనపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ కోసం 10 కీలక అంశాలపై చర్చ జరగనుంది. అవి: 1) మావ నాటే మావరాజ్యం, 2) ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కోడ్, 3) ఆదివాసీల భాషను కోయతూర్ ఎనిమిదవ రాజ్యాంగ షెడ్యూల్డ్లో చేర్చడం, 4) ఆదివాసి ప్రాంతాలలో ఉద్యోగ భద్రత Go ms no 03 పునరుద్ధరణ, 5) ఆదివాసి ప్రాంతాల్లోని వనరుల ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికి ఖర్చు చేయడం, 6) పోలవరం, కాలేశ్వరం వంటి ప్రాజెక్టుల ముంపు బాధితుల రక్షణ, 7) దేశవ్యాప్తంగా ఆదివాసీ చట్టాలలో ఏకరూపత, 8) ఫారెస్ట్ రక్షణ చట్టం మార్పుల పునరుద్ధరణ, 9) ఆదివాసి ప్రాంతాలలో శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాలను 100% పెంచి, ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, భాషాయుక్త రాష్ట్రాల విభజన విధానంలో చిన్న రాష్ట్రాలుగా విభజించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం.












