వెంకటాపురం, 5 September
కేంద్రం బీఆర్ఎస్ పెద్దులు కార్యక్రమం హాజరయ్యారు.ని బీఆర్ఎస్ పెద్దులు ఈ పెద్దులు పెద్దులు
బీఆర్ఎస్ సమరభేరి బైక్ ర్యాలీ 500కు పైగా బైకులతో భారీ ప్రదర్శన
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మండల కేంద్రంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప రాంబాబు పిలుపు మేరకు 500కు పైగా బైకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇండియన్ ఆయిల్ బంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ శివాలయం వరకు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పేరుతో ప్రజా సమస్యలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. వృద్ధులు, మహిళలు, రైతులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు. మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమీకృతం కావడం పార్టీకి బలాన్ని చేకూర్చిందన్నారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధాకరమని పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల వివక్ష చూపుతున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆదుకునేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుడపర్తి నరసింహమూర్తి, బట్ట నాగేంద్ర, మానే రామకృష్ణ, చెరుకూరి సతీష్, మాజీ సర్పంచ్ తుర్స సూరిబాబు, సురవీడు సర్పంచ్ ఇర్ప మురళి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


